Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రి ఆరోపణలను ఖండించిన క్రికెటర్ రవీంద్ర జడేజా

Ravindra Jadeja condemns his father allegations
Advertisement
  • కోడలు రివాబాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జడేజా తండ్రి
  • తమ కుటుంబంలో రివాబా చీలికలు తెచ్చిందని ఆరోపణ
  • అవి నిరాధారమైన ఆరోపణలన్న రవీంద్ర జడేజా
Advertisement
టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా కోడలు  రివాబాపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ కుటుంబంలో చీలికలు రావడానికి రివాబానే కారణమని అన్నారు. ఆమె తమ ఇంట అడుగుపెట్టినప్పటి నుంచే గొడవలు మొదలయ్యాయని తెలిపారు. 

అయితే, తండ్రి వ్యాఖ్యలను రవీంద్ర జడేజా ఖండించాడు. ఆయన ఆరోపణలన్నీ నిరాధారం అని స్పష్టం చేశాడు. తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలా ఇంటర్వ్యూల పేరుతో ప్రయత్నిస్తున్నారని మండిపడ్డాడు. ఏకపక్షంగా ఇంటర్వ్యూను ప్రచురించడం సరికాదని, ఈ వ్యవహారం తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని జడేజా పేర్కొన్నాడు. ఈ మేరకు గుజరాతీ భాషలో సోషల్ మీడియాలో స్పందించాడు.
Advertisement
Advertisement
Ravindra Jadeja
Rivaba
Anirudh Singh
Gujarat
Team India

More Telugu News